Posts

Showing posts from March, 2019

Amazing Health Benefits of Anjeer (Indian Fig)

Image
అంజీర /మేడిపండు /అత్తిపండు :- అంజీర అందరికి డ్రై ఫ్రూట్ గానే తెలుసు ఈ అంజీర పండును మేడిపండు, అత్తిపండు, Indian Fig అని కూడా అంటారు. ఈ మేడిచెట్టుకు ఆధ్యాత్మికంగానే కాదు ఆయుర్వేధంలో కూడా చాల ప్రాముఖ్యత ఉంది. మేడి పండ్లను కాయలను, ఆకులను, బెరడును వేరును ఇలా అన్నింటిని ఆయుర్వేధంలలో ఎక్కువగా వాడుతారు. అంజీర పండ్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి పండు రూపంలో ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందువల్ల వీటిని డ్రై ఫ్రూట్ గా ఎక్కువగా వాడుతారు. మేడిచెట్టును క్షీరవృక్షం అని అంటారు. పాలు, పాల ఉత్పత్తులు తీసుకొని వారు అంజీర పండ్లను తీసుకోవటం మంచిది. పోషకాలు :- ఇందులో విటమిన్ ఏ, బి, బి 12, సి ఉంటాయి. వీటిలో కొవ్వు పిండి పదార్ధాలు కాలిష్యం, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటిఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా సెల్యూలోజ్ కూడా లభిస్తుంది. లాభాలు :- రక్తహీనతతో బాధపడే వారికీ రోజు ఈ అంజీర పండ్లను (పచ్చివి లేదా ఎండినవి ) 3 లేదా 4 తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ప్లేట్లెట్స్ తగ్గిన వారికీ కూడా ఇది చాల మంచిది . కఫం, పైత్యం