Posts

Showing posts from January, 2019

ఉసిరి (The Indian gooseberry) వల్ల కలిగే ప్రయోజనాలు.

Image
ఉసిరి: చలికాలంలో ఎక్కువగా దొరికేది, అనేక ఆయుర్వేద లక్షణాలు, ఔషధ గుణాలు కలిగినదే ఉసిరి. దీనిని ఆరోగ్యం కోసమే కాకుండా, కార్తీకమాస దీపారాధనలో వాడుతారు. రుచికి పుల్లగా, వగరుగా ఉండే ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.  పోషకాలు : ఉసిరి ఆకుల దగ్గర నుండి బెరడు వరకు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరి లో "విటమిన్ సి" ఎక్కువగా ఉంటుంది.దీనిలో కాల్షియం, పాస్పరస్, ఐరన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. వీటిలో తక్కువ కాలరీలు ఎక్కువ పోషకాలుంటాయి. ఉసిరి యాంటీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. లాభాలు: వాత, పిత్త, కఫ రోగాలను నయం చేయడం లో ఉసిరి పొడిని వాడతారు.  తేనెలో నానబెట్టిన ఉసిరిని తీసుకోవడం వాళ్ళ జాండిస్ ను నివారిస్తుంది. లివర్ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులను అరికడుతుంది.   స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. పురుషులలో  వీర్యం నాణ్యత పెరుగుతుంది.  పడుకునే ముందు చెంచా ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.   వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా యవ్వనంగా కనిపించేలా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

Health Benefits of Broccoli (బ్రోకలీ)

Image
బ్రోకలీ: సూపర్ మార్కెట్ లో మనం నిత్యం చూసే గ్రీన్ వెజిటల్ బ్రోకలీ. ఇది చూడటానికి కాలిఫ్లవర్ లా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటల్ గా దీనికి పేరుంది . పోషకాలు:   దీనిలో విటమిన్ ఏ, బి5, సి, ఇ ఇంకా కె ఉంటాయి, వీటితో పాటు కాల్షియమ్, మెగ్నిషియం , పొటాషియం ఉంటాయి. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్ , న్యూట్రీషియన్స్  ఉంటాయి, వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  లాభాలు:  బ్రోకలీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ను, టాక్సిన్స్ ను బయటకు విసర్జిస్తాయి.   వీటిలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కాలుష్యం వల్ల పాడైన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేస్తుంది.  జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, అంతే కాకుండా పెద్ద ప్రేగు లోపల ఏర్పడే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది .  కాన్సర్ కణతులను తగ్గించి, కాన్సర్ కారకాలను తొలగించే అత్యుత్తమ ఆహార పదార్ధం ఇది.  దీనిలో వుండే కాల్షియమ్ ఎముకలను ధృడంగా చేస్తుంది.   ప్రపంచంలోనే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉపయోగించే వెజిటల్ ఇది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. తీ

Amazing Benefits of Corn (మొక్కజొన్న)

Image
మొక్కజొన్న కార్న్:- పోషకాలు:  మనం ఎంతో ఇష్టంగా తీసుకునే చిరు తిండ్లలో ముఖ్యమైనది మొక్కజొన్న చిన్న పిల్లల నుడి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ అయితే పిల్లలు మరి ఇష్టంగా తింటారు కానీ వీటిలో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అనేక పోషకాలు ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇంకా వీటిలో ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం తో పాటు ఫాలిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి   లాభాలు:-   వీటిలో అధిక మోతాదులో ఉం డే ఫైబర్ మలబద్దకం సమస్యను, మొలల సమస్యను నివారిస్తుంది.  ముతపిండాల పని తీరుని మెరుగుపరుస్తుంది.   వీటిలో ఉండే పాంటాథైనిక్ అనే ఆమ్లం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.   వీటిలో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాల వృద్ధికి ఉపయోగపడుతోంది తద్వారా రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.   రక్తంలోని కోలెస్టల్ ను తగ్గించి గుండెపోటు రాకుండ నివారిస్తుంది.   ఎముకలను ధృఢంగా చేస్తుంది.   ఇవి శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.   నాడీ వ్యవస్థ పని

Kiwi fruit health benefits in Telugu

Image
కీవి: పోషకాలు: మనం తీనేటువంటి దాదాపు 26 రకాల పండ్లలో కంటే కీవి పండులో ఎక్కువ పోషకాలుంటాయి. అంతే కాకుండా నారింజ, బత్తాయి వంటి పండ్లలో లభించే c విటమిన్ కంటే కీవి పండులో రెండు రెట్లు ఎక్కువగా c విటమిన్ లభిస్తుంది. అందుకే దీనిని "వండర్ ఫ్రూట్ " అంటారు. ఇందులో విటమిన్ C, E ఉంటాయి. ఇందులో Folic acid కూడా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియమ్ , మెగ్నీషియం , ఐరన్ కూడా లభిస్తాయి. లాభాలు : రోగనిరోధక శక్తిని పెంచుతుంది.   అధిక బరువును తగ్గించండంలో ఉపకరిస్తుంది. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.   ఇది రక్త పోటును తగ్గిస్తుంది , షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది.   ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కొలస్ట్రాల్, బీపీ ని అదుపులో ఉంచుతాయి.   కంటి చూపును మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.   వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేయటంలో ఉపయోగపడుతుంది.   వీటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్ గర్భిని స్త్రీలకు మంచిది.   కాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.   ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది కనుక దీనిని తప్పక రోజు వా

strawberry (స్ట్రాబెర్రీ) advantages and disadvantages in Telugu

Image
స్ట్రాబెర్రీ: పోషకాలు: స్ట్రాబెర్రీలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా చాల ఎక్కువ మోతాదులో పోషకాలు కలిగిఉండే పండ్లలో ఇది ఒకటి. స్ట్రాబెర్రీలలో విటమిన్ a,c ఇంకా విటమిన్ B6, B9, E&K ఉంటాయి. వీటిలో ఇంకా  మెగ్నీషియం,క్యాల్షియం,ఐరన్,పాస్ఫరస్,అయోడిన్ ఉంటాయి.  లాభాలు: స్ట్రాబెర్రీలలో ఉండే ఫెనోలిక్ కంపౌండ్లు కాన్సర్ కణతిని తగ్గించడంలో తోడ్పడతాయి.ముక్యంగా రొమ్ము కాన్సర్ ను నయం చేయడంలో దోహదపడతాయి.   రక్తంలో కొవ్వుశాతం తగ్గిస్తాయి. తద్వారా గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు.   దీనిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్ పొట్ట దగ్గరి కొవ్వుని కరిగించి మంచి శరీర ఆకృతిని ఇస్తుంది.   వీటిలో చాలా తక్కువగా ఉండే క్యాలోరిస్ డైట్ పాటించేవారికి చాలాబాగా ఉపయోగపడతాయి. బరువుని నియంత్రించే హార్మోన్ల పనితీరుని క్రమబద్దీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలలో ఉంటుంది.అందువల్ల బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.   అజీర్ణ సమస్యలను తగ్గించి,గ్యాస్,మలబద్దకం,అసిడిటీ తదితర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.   వీటిలో ఉండే ఆంథోసనియన్స్ ఆడిపోనెక్టిం అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మన శరీర మె