Health Benefits of Broccoli (బ్రోకలీ)


బ్రోకలీ:

సూపర్ మార్కెట్ లో మనం నిత్యం చూసే గ్రీన్ వెజిటల్ బ్రోకలీ. ఇది చూడటానికి కాలిఫ్లవర్ లా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటల్ గా దీనికి పేరుంది .

పోషకాలు: 

దీనిలో విటమిన్ ఏ, బి5, సి, ఇ ఇంకా కె ఉంటాయి, వీటితో పాటు కాల్షియమ్, మెగ్నిషియం , పొటాషియం ఉంటాయి. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్ , న్యూట్రీషియన్స్  ఉంటాయి, వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 

లాభాలు:

  1.  బ్రోకలీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ను, టాక్సిన్స్ ను బయటకు విసర్జిస్తాయి. 
  2.  వీటిలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కాలుష్యం వల్ల పాడైన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేస్తుంది.
  3.  జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, అంతే కాకుండా పెద్ద ప్రేగు లోపల ఏర్పడే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది . 
  4. కాన్సర్ కణతులను తగ్గించి, కాన్సర్ కారకాలను తొలగించే అత్యుత్తమ ఆహార పదార్ధం ఇది.
  5.  దీనిలో వుండే కాల్షియమ్ ఎముకలను ధృడంగా చేస్తుంది. 
  6.  ప్రపంచంలోనే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉపయోగించే వెజిటల్ ఇది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. తీపి పదార్థాలు తినాలనే కోరికను తగ్గిస్తుంది. 
  7.  వీటిలో యాంటీ ఎలెర్జిటిక్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక అలెర్జీలు, రోగాల బారిన పడకుండా చేస్తుంది.
  8.  మతిమరుపును తగ్గించి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మెదడు పనితీరును, నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది.
  9.  దీనిలో వుండే ఫైబర్ శరీరంలో ఉండే అనవసరపు కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, బరువు తగ్గాలనుకునేవారు దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
  10.  కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, దృష్టి లోపాలను సరిచేస్తుంది.

Comments

Popular posts from this blog

Phool Makhana (తామర గింజలు) Health Benefits, Medical Uses And Its Side Effects in Telugu

ఉసిరి (The Indian gooseberry) వల్ల కలిగే ప్రయోజనాలు.